పయనించే సూర్యుడు మార్చి 14, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ రూరల్ వలసపాకల గ్రామంలో బిజెపి నాయకులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్ కుమార్, జిల్లా కిషన్ మోర్చా నాయకులు బొలిశెట్టి రామకృష్ణ లు మాట్లాడుతూ మతాలను గౌరవించడంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుందని, అందులో భాగంగా హిందువుల నుంచి వచ్చే పన్నులతోనే గత ప్రభుత్వంలో 5వేల మందికి 5వేల రూపాయలు వేతనం ఇచ్చేవారని..అటువంటిది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరో 8వేల మందికి పెంచి, 13వేల మంది పాస్టర్లకు వేతనం చెల్లిస్తుంటే…వంద కోట్ల మంది హిందువుల నాయకుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మతాలపై చిచ్చుపెట్టి రాజకీయం చేస్తుందని ఎద్దేవా చేశారు. కాపులను వ్యతిరేకించిన వ్యక్తి అంబటి రాంబాబు తన ముగ్గురు కూతుర్లను కాపేతరులకు ఇచ్చి పెళ్లి చేయలేదంటూ గుర్తు చేశారు.సమాజంలో ప్రజా సామరస్యాన్ని దెబ్బ తీసే విధంగా పాస్టర్ల వ్యాఖ్యలు ఉన్నాయంటూ మండిపడ్డారు. మతమార్పిడి కోసమే పాస్టర్లకు ఎన్డీఏ గవర్నమెంట్ జీతాలు ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు. దేశంలో కుల మతాలకతీతంగా అభివృద్ధి చేస్తుంటే క్రైస్తవుల మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని లేకుంటే పరిణామాలు వేరే ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు పెండెం సత్యనారాయణ, బిజెపి కాకినాడ రూరల్ అధ్యక్షులు నండూరి సత్తిబాబు, జిల్లా కిసాన్ మోర్చా నాయకులు సిద్ధ వీరభద్రరావు, మండల కార్యదర్శి పాలిక శివ జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు పెంకె అరుణ్ కుమార్, బిజెపి నాయకులు ఢిల్లీ నాయుడు అజయ్ మరియు లావరాజులు పాల్గొన్నారు.