సాక్షి డిజిటల్ న్యూస్ నిర్మల్ జిల్లా ప్రతినిది, ( జునైద్ ఖురేషి) మార్చి 14 : ఉట్నూర్ మండలం నవోదయనగర్ కి చెందిన ఆత్రం గంగుబాయి బిడ్డకు జన్మనిచ్చి స్వర్గస్తులయ్యారు. గత నాలుగు నెలల క్రితం ఆమె భర్త కూడా చనిపోవడంతో పిల్లలు అనాధలయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఈరోజు వారి ఇంటికి చేరుకొని చిన్న పిల్లలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎలాంటి అవసరం ఉన్నా తెలియజేయాలని 5000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. అలాగే చిన్నారి పెద్దయ్యే వరకు పాలు, పోషణ ఖర్చులు మొత్తాన్ని తానే భరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన టీచర్ బలిరామ్ కుటుంబాన్ని కూడా పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
