జైపూర్ మండలంలోని గ్రామపంచాయతీల ఆకస్మిక తనిఖీ

*అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య ఐఏఎస్

సాక్షి డిజిటల్ న్యూస్ మంచిర్యాల 14/3/2026, ప్రజా పాలన 99వ ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం రోజున అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య జైపూర్ మండలంలోని ఇందారం మరియు రామారావు పేట గ్రామపంచాయతీలు ఆకస్మికంగా తనిఖీ చేశారు షెడ్యూల్ ప్రకారం గ్రామంలో డ్రై డే నిర్వహించగా పరిశీలించి ప్రతి శుక్రవారం అన్ని గ్రామ పంచాయతీలు కచ్చితంగా డ్రై డే నిర్వహించాలని గ్రామంలో ప్రతిరోజు పారిశుద్ధి కార్యక్రమాలను నిర్వహించి రోడ్లు మరియు డ్రైనేజీలు శుభ్రం చేసి గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని త్రాగునీటి సరఫరాను పరిశీలించి మోటార్లకు విద్యుత్ వినియోగం తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రతిరోజు ఉదయం రెండు గంటలు మరియు సాయంత్రం ఒక గంట అవసరం ఉన్న మేరకే బోర్లను వాడాలని కరెంటు వినియోగాన్ని తగ్గించాలని ప్రతి నల్ల కు ఆన్ ఆఫ్ బిగించాలని గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ ఎంపీ ఓ శ్రీపతి బాపూరావు ఇందారం రామారావు పేట గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్లు ఫయాజుద్దీన్ పులి రాజశేఖర్ పంచాయతీ కార్యదర్శులు వార్డు సభ్యులు అంగన్వాడీలు సుమన్ రజిత మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *