సాక్షి డిజిటల్ న్యూస్, మార్చ్ 14 2026 జగిత్యాల జిల్లా, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ నేమూరి కరుణాకర్, మెట్పల్లి మండలం మారుతి నగర్ వద్ద జాతీయ రహదారిపై గురువారం రాత్రి (AP 09 CL 8044) నంబర్ గల కారు ఆటో(TG 21 T 0532) ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో 36 రోజుల పసికందు మృతి చెందింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.