పయనించే సూర్యుడు మార్చ్ 14(సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు ) జహీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో సిమెంటు రహదారుల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ద్వారా రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని శాసనసభ్యుడు మాణిక్ రావు తెలిపారు. ఈ నిధులతో రేపటి నుంచే నిర్మాణ పనులు మొదలవుతాయని, రహదారులు అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో రవాణా ఇబ్బందులు తొలగుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా వర్షాకాలంలో మట్టి దారుల వల్ల ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ఈ సిమెంటు రహదారుల నిర్మాణంతో పరిష్కారం అవుతాయని వెల్లడించారు. పల్లెల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ నిరంతరం శ్రమిస్తున్నామని ఆయన వివరించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు తీసుకువచ్చిన మాణిక్ రావుకు స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలియజేశారు.