జహీరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం పాల్గొన్న సెట్విన్ సంస్థ అధ్యక్షుడు గిరిధర్ రెడ్డి

పయనించే సూర్యుడు మార్చ్ 14(సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు ) జహీరాబాద్ పట్టణంలోని పన్నెండవ వార్డు గడి ప్రాంతానికి చెందిన రవి ఆహ్వానం మేరకు శుక్రవారం నిర్వహించిన నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర సెట్విన్ సంస్థ అధ్యక్షుడు గిరిధర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు సిద్ధం ఉజ్వల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు రవి వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదల అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు శిరీష సురేందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు నాగిరెడ్డి, సీనియర్ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి, పన్నెండవ వార్డు బాధ్యుడు ఇనాయత్, కౌన్సిలర్ అరుణ్ కుమార్, పద్నాలుగో వార్డు బాధ్యుడు రాజ్ కుమార్, నరేష్ బబ్లూ, నర్సింహా యాదవ్, మోహీన్, పవన్ తదితరులు పాల్గొన్నారు.