జనసేన జానీ సేవలు అమోఘం

★కొల్ల జయరామ్

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 14, పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జ్ (* గంగాడ గౌరీ శంకర్ *) జనసేన పార్టీ కోసం జనసేన జానీ అందజేస్తున్న సేవలు అమోఘమని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొల్ల జయరాం, పొందూరు మండలం జనసేన సీనియర్ నాయుకులు గార బాబురావు లు అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని చెప్పుల్లు లేకుండా నడుస్తున్న జనసేన జానీ అని అభినంధించారు. కాలుకు చెప్పులు లేకుండా ఒక్క పది నిమషాలు నడవటం అంటేనే అసాధ్యం అలాంటిది ఇన్ని సంవత్సరాలనుండి కాళ్ళ కి చెప్పులు వేసుకోకుండా ఎండల్లో కొండల్లో అడివిలో 2019 నుంచి జనసేన పార్టీ బలోపేతం కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గా చూడటం కోసం కాళ్ళకి చెప్పుల్లులేకుండా ఇన్ని సంవత్సరాలుగా నడవటం అంటే పార్టీ పట్ల, పవన్ కళ్యాణ్ పట్ల తనకు ఉండే చిత్త శుద్ధి కి అభినందిస్తున్నామని అన్నారు. అందుకే జనసేన పార్టీ కోసం అలుపెరుగనిపోరాటం చేస్తున్నా జనసేన జానీ పార్టీ అధిష్టానం మరియు రాష్ట్రా ఎమ్మెల్సి కొణిదెల నాగబాబు మెచ్చిన వ్యక్తి జిల్లా సంయుక్త కార్యదర్శి పాలకొండ నియోజకవర్గం జనసేన జానీ గౌరవంగా అభినంధించడం జరిగింది అని జిల్లా కార్యదర్శి కొల్ల జయరాం అన్నారు. ఈ కార్యక్రమంలో వీరఘట్టం మండలం జనసేన సీనియర్ నాయుకులు మత్స పుండరికం పాల్గొన్నారు.