పయనించే సూర్యుడు మార్చి 14, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: జడ్చర్ల పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు , జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి గారికి మున్సిపల్ కార్మికులు తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. పట్టణ కమిటీ అధ్యక్షురాలు వి. ఇందిరమ్మ నేతృత్వంలో కార్మికులు మంత్రులను కలిసి తమ సమస్యలను వివరించారు.ఈ సందర్భంగా అధ్యక్షురాలు ఇందిరమ్మ మాట్లాడుతూ.. ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేసే అంశాన్ని చర్చించాలని కోరారు. అలాగే కార్మికులకు కనీస వేతనం రూ. 26,000 అమలు చేయాలని, 2012 నుండి 2014 వరకు కార్మికుల వేతనాల నుంచి ఈపీఎఫ్ డబ్బులు కట్ చేసినప్పటికీ, ఇప్పటివరకు ఆ నిధులను ఈపీఎఫ్ సంస్థకు జమ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని వివరించారు. దాదాపు 8 మంది కమిషనర్లు మారినా కార్మికుల జాబితాను హైదరాబాద్ ఈపీఎఫ్ కార్యాలయానికి పంపలేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 2013 నుండి 2026 వరకు సుమారు 52 మంది కార్మికులు వివిధ కారణాలతో చనిపోయారని, వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. సర్క్యూలర్ ప్రకారం కార్మికులకు రావాల్సిన సెలవులను కూడా ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.కార్మికుల ఇచ్చిన విన్నపంపై మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సానుకూలంగా స్పందింస్తూ , త్వరలోనే మీ సమస్యలను పరిశీలించి, కార్మికులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి విద్యాసాగర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మహేష్, దేవమ్మ, యాదమ్మ, శివలీల, స్వరూప, అంజమ్మ తదితర కార్మికులు పాల్గొన్నారు.