చేతివృత్తులకు ఆర్థికంగా చేయుతనిచ్చేందుకు విశ్వకర్మ యోజన పథకం ద్వారా ఉచిత టూల్ కిట్స్ ని పంపిణీ చేసిన

★నగర మేయర్ కొలగాని శ్రీనివాస్

పయనించే సూర్యుడు మార్చి 14 కరీంనగర్ న్యూస్: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని చింతకుంట లో శుక్రవారం రోజు విశ్వకర్మ యోజన పథకం కింద పరికరాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర ప్రథమ పౌరులు కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 15 రోజులపాటు ఈ పథకంలో శిక్షణ పొందిన వారికి తన చేతుల మీదుగా 56 కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ….సబ్ కా సాత్…సబ్ కా వికాస్ అనే నినాదం తో దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం ద్వారా పేద మధ్యతరగతి ప్రజల శ్రేయస్సుకొసం బృహత్తరమైన పథకాలను ప్రవేశపెట్టి… కోట్ల మంది ప్రజలకు లబ్ధిచేకూరుస్తున్నారని తెలిపారు. ప్రధాన మంత్రి ప్రవేశపెట్టిన పథకాలు కిందిస్థాయి ప్రజల వరకు చేరడం సంతోషకరం అన్నారు. ఇందులో భాగంగా విశ్వకర్మ యోజన పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రం లో కొత్తపల్లి మండల కేంద్రంలోనే దాదాపు 260 మంది లబ్ధిపొందడం చాలా గొప్ప విషయం అన్నారు. విశ్వకర్మ యోజన పథకం ద్వారా 18 రకాల సాంప్రదాయ కుల వృత్తులను ప్రోత్సహించి… కళాకారుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారని తెలిపారు. విశ్వకర్మ యోజన పథకం ద్వారా 15 రోజులు వృత్తిపరమైన శిక్షణ పొందిన వారికి 15 వేల విలువచేసే వృత్తిపర పరికరాలను అందించడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ పథకంలో తక్కువ వడ్డీతో వ్యాపారులకు మొదటి విడుత 1 లక్ష రూపాయలు, రెండో విడుత 2 రూపాయల రుణ సదుపాయం కల్పించి వారికి ఉపాధిని కల్పించడం దరిగిందని తెలిపారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల పక్షాణ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నగర ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలను సద్వినియోగం చేస్కోని… ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకోవాలని పిలుపు నిచ్చారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేస్కోని… ఆర్థింగా ముందుకు సాగాలని కోరారు. ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితుల్లో దేశాల మధ్య యుద్ద వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో భారత దేశం ఎంతో సురక్షితంగా ఉందంటే దానికి పెద్దలు నరేంద్ర మోడీ నాయకత్వమే కారణమని తెలిపారు. దేశ రక్షణ… ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న నరేంద్ర మోడీ కి భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించి… మరింత శక్తిని ఇవ్వాలని కోరుకున్నారు. రేపు కరీంనగర్ నగరంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంకల్పించిన అంజన్న ఆశీర్వాద యాత్ర కు నగర ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంతో మేయర్ పీఠం దక్కాలని ఆనాడు మంత్రి బండి సంజయ్ కుమార్ అంజన్న స్వామీని కోరుకున్నారని… మొక్కు పలించిన నేపథ్యంలో బీజేపీ పాలకవర్గం తో మహాశక్తి అమ్మవారి ఆశీర్వాదం తీస్కోని రేపు ఉదయం అంజన్న ఆశీర్వాద యాత్ర తో పెద్ద ఎత్తున పాదయాత్ర చేపట్టడం జరిగిగిందని తెలిపారు. బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో జరిగే పాదయాత్ర కు ప్రజలు, పార్టీ శ్రేణులు, అంజన్న భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అనిల్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.