సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 14 నల్గొండ జిల్లా చిట్యాల మండలం, పచ్చి మాసి యా లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాపై తీవ్ర ప్రభావం ఏర్పడిన నేపథ్యంలో నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో గ్యాస్ కొరత ఏర్పడింది అధికారులు గ్యాస్ కొరత లేదు అని చెప్పినప్పటికీ సాధారణ ప్రజలకు గ్యాస్ అందని ద్రాక్ష లాగా అయిపోయింది ఇదిలా ఉండగా గ్యాస్ సిలిండర్ మాత్రం బ్లాక్ మార్కెట్లో 4500 వరకు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. గతంలో డొమెస్టిక్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత సిలిండర్ డెలివరీ 15 రోజుల వ్యవధి ఉండేది తరువాత 30 రోజులు 45 రోజులు పడుతుందని స్థానిక గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు చెప్పడం గమనహరం ఒక సిలిండర్ ఉన్నవారికి 20 రోజుల తర్వాత బుక్ చేసుకోవాలని షరతు విధించారు ఇదిలా ఉండగా బ్లాక్ మార్కెట్లోకి వీరి కి ఎలా సిలిండర్ వెళ్తున్నాయో అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా ప్రజల అవసరాల కోసం వంట గ్యాస్ అందుబాటులో ఉంచాలని మహిళలు కోరుతున్నారు.