ఘనంగా శ్రీ శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి 32వ వార్షికోత్సవ వేడుకలు.

సాక్షి డిజిటల్ న్యూస్ రావికమతం,మార్చి 14 : మండలంలో కొత్తకోట గ్రామంలో వేంచేసి యున్న శ్రీ శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ 32వ వార్షికోత్సవ వేడుకలు, తీర్ధ మహోత్సవం శుక్రవారం ప్రారంభ మయ్యాయి.ఈ నెల 13,14,15 తేదీల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.ప్రతి ఏడాది మూడు రోజులపాటు ఈ వార్షికోత్సవ వేడుకలు శుక్ర, శని, అది వారాలలో నిర్వహిస్థారు. ఈ మూడు రోజులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.ఈ మూడు రోజులు ఉదయం నుంచీ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహిస్తారు. మొదటి రోజు శుక్రవారం గ్రామానికి చెందిన పచ్చి గోళ్ళసంతోస్ , నందిని దంపతులు స్వామివారికి అన్ని రకాల ప్రసాదాలు, పువ్వుల దండలు వేసి మొదటి పూజ చేసుకున్నారు. స్వామివారిని సర్పంచ్ లోవరాజు , ఉప సర్పంచ్ దేవా, కూటమి నాయకులు కోట సత్యనారాయణ తదితరులు
స్వామివారిని దర్శించుకున్నారు. శేషు రావికమతం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *