గ్రామ పంచాయతీలకు విడుదలైన నిధుల వినియోగం పైన విచారణ-పర్యవేక్షణ

★నిధులు దుర్వినియోగం కాకుండా సక్రమంగా అమలు చేయుటకు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్, డిపిఓ లకు ఫిర్యాదు ★అక్కపెల్లి రవీందర్ ఆర్టిఐ జగిత్యాల జిల్లా అధ్యక్షులు

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 14 చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ కొండూరి సురేష్, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని కొందరు పంచాయతీ కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు కలిసి నూతనంగా విడుదలైన 15 ఫైనాన్స్ పైకమున తప్పుడు బిల్లులు పెట్టి డ్రా చేస్తున్నారని, దానిపైన సమగ్ర విచారణ జరిపి సక్రమంగా వాటిని వినియోగంలోనికి వచ్చే విధంగా తగుచర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులకు వినతి పత్రం ఇచ్చినట్లు అక్కపెల్లి రవీందర్ ఆర్టిఐ జగిత్యాల జిల్లా అధ్యక్షులు తెలిపారు. మండలంలోని పంచాయతీ కార్యదర్శులు గృహ నిర్మాణ అనుమతులు, ప్రహరీ గోడలు,పలు విషయాలపై దరఖాస్తులు చేసుకున్న వాటిని నక్ష ప్రకారము మోకాపై డాక్యుమెంట్ ఆధారంగా పర్యవేక్షణ జరిపి పర్మిషన్ ఇవ్వాల్సి ఉండగా వాటి పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఎక్కడో ఉండి ఒత్తిడులకు తలోగ్గి ఏ నిర్మాణం లేని ఖాళీ స్థలములకు కూడా అక్రమ అనుమతులు మంజూరు చేస్తూ గ్రామాలలో గొడవలకు కారకులవుతున్నారని, కొందరు పంచాయతీ కార్యదర్శులు సాయంత్రం వరకు ఉండవలసి ఉన్నప్పటికీ వివిధ మీటింగుల పేరుతో ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని అక్కపెల్లి రవీందర్ ఆర్టిఐ జగిత్యాల జిల్లా అధ్యక్షులు వినతిపత్రంలో తెలిపారు.