సాక్షి డిజిటల్ న్యూస్ 14 మార్చి 2026 దేవరాపల్లి రిపోర్టర్ రాజు, వీఎమ్ఆర్డిఏ పరిధిలో అన్ని నియోజక వర్గాలలో మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా పనిచేస్తుందని వీఎమ్ఆర్డిఏ కమిషనర్ తేజ్ భరత్ అన్నారు. మండల కేంద్రం దేవరాపల్లిలోని విఎంఆర్డిఏ నిధులతో రెండు ఎకరాలలో 25 లక్షలతో మినీ మల్టీపర్పస్ హాలు, రూ. 51 లక్షలతో పార్కు నిర్మాణాన్ని వీఎమ్ఆర్డిఏ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అంతకుముందు సచివాలయం సమీపంలో జలజీవన్ మిషన్ పథకం కింద రూ. 5.62 కోట్ల నిర్మించిన ఇంటింటి కొలాయి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. విఎంఆర్డిఏ సహకారంతో ఇప్పటికే నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం 1.76 కోట్లు కేటాయించిందన్నారు. అలాగే దేవరాపల్లిలో పార్కులో పిల్లల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని కమిషనర్ ప్రకటించడం హర్షదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సబ్బవరపు పెంటమ్మ, మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, టిడిపి సీనియర్ నాయకులు పైలా ప్రసాదరావు, మండల ప్రత్యేక అధికారిణి ఎస్.మంజుల వాణి, ఆర్ బ్ల్యూ ఎస్ డి ఈ జీవీఎస్ ప్రకాష్, తహసీల్దార్ పి.లక్ష్మీదేవి, ఎంపీడీవో ఎస్.కిరణ్ వరప్రసాద్, ఆర్ బ్ల్యూఎస్ ఏఈ కె చంద్రశేఖర్, విఎమ్ఆర్డిఏ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఇరిగేషన్ అధికారులు, మండల పార్టీ అధ్యక్షులు పెద్దాడ వెంకటరమణ, పూడి సత్యారావు మాడుగుల నియోజకవర్గ తెలుగు రైతు ఆర్గనైజింగ్ కార్యదర్శి కడిమి నాగేశ్వరరావు,శరఖాన సూర్యనారాయణ, సోమిరెడ్డి గోవింద, బంధం అప్పలరాజు, గొల్లపల్లి మురళీకృష్ణ, కర్రి నాయుడు, కర్రీ పుష్ప, మండల ఎస్సీ సెల్ అధ్యక్షురాలు కె. జ్యోలా, గుల్లిపల్లి అర్జున తదితరులు పాల్గొన్నారు.