క్లీన్ కంటోన్మెంటే లక్ష్యంచెత్త సేకరణ వాహనదారులతో సమావేశంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ నటరాజ్ గౌడ్ మార్చి 14. కంటోన్మెంట్ లో చెత్త సేకరణ చేస్తున్న వాహన దారులతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ శుక్రవారం బోర్డు సి ఇ ఓ అరవింద్ కుమార్ ద్వివేది తో కలిసి మడ్ ఫోర్డ్ లోని కంటోన్మెంట్ వర్క్ షాప్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ ముందుగా చెత్తను సేకరించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న వాహనదారులందరికీ ధన్యవాదాలు తెలియ జేశారు. ప్రతి ఇంటికీ వెళ్లి చెత్తను సేకరించాలని, ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని వాహనదారులతో అన్నారు. చెత్త సేకరణ వాహనదారుల అసోసియేషన్ కంటోన్మెంట్ బోర్డుతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతీ వాహనదారుడు 200 ఇళ్ళకు వెళ్ళి సేకరించాలని, 80 వాహనాలకు ఒప్పందం చేసుకుని 52 వాహనాలే తిప్పుతున్నారని, వెంటనే ఒప్పందం ప్రకారం వాహనాలను నడపాలని చెప్పారు. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా 160 వాహనాలు అవసరమైతాయని, కంటోన్మెంట్ బోర్డు కూడా మరిన్ని వాహనాలను పెంచి చెత్తను సేకరించాలని, ప్రజలు కూడా శుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చి రోడ్లపై చెత్తను వేయకుండా చూసేలా వారికి అవగాహన కల్పించాలని, క్లీన్ కంటోన్మెంటే లక్ష్యంగా అందరం కలిసి పనిచేయాలని చెప్పారు. శుభ్రత ఉంటే రోగాలు కూడా దరిచేరవని, వాహనదారులు విధంగా ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించాలని, వాహనదారుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని అన్నారు. కావున బాధ్యతతో వ్యవహరించి కంటోన్మెంట్ ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని చెప్పారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ తో పాటు బోర్డు నామినేటెడ్ సభ్యురాలు శ్రీమతి భానుక నర్మద మల్లికార్జున్, హెల్త్, శానిటేషన్ సూపరింటెండెంట్ లు దేవేందర్, మహేందర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ లు అశుతోష్ చౌహాన్, పుష్పేందర్ గుప్త లు పాల్గొన్నారు.