కొరుట్లలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం పాత వంట నూనె వినియోగంపై ఫిర్యాదు

★మున్సిపల్ కమిషనర్ కు మహమ్మద్ ముజాహిద్ టైగర్ అలీ నవాబ్ వినతి

సాక్షి డిజిటల్ న్యూస్ 14 మార్చి 2026 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్ ) బోనగిరి మల్లారెడ్డి, జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కొన్ని స్ట్రీట్ ఫుడ్ విక్రేతలు మరియు టిఫిన్ సెంటర్లలో పాత వంట నూనెను పలుమార్లు పునర్వినియోగం చేస్తున్నారని సమాజవాది పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మరియు యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముజాహిద్ కొరుట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ మరియు మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. పట్టణంలో ప్రజలతో మాట్లాడినప్పుడు కొన్ని స్ట్రీట్ ఫుడ్ విక్రేతలు మరియు టిఫిన్ సెంటర్లు ఒకే వంట నూనెను మూడు నుండి నాలుగు రోజుల వరకు మళ్లీ మళ్లీ ఉపయోగిస్తున్నట్లు సమాచారం అందిందని ఆయన తెలిపారు. ఈ విధంగా పునర్వినియోగం చేసిన నూనె ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన హానికరం కావచ్చని, అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఇక తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ టైగర్ అలీ నవాబ్ మాట్లాడుతూ కొరుట్ల పట్టణంలోని కొన్ని చాయ్ హోటళ్లలో గ్లాసులను సరిగా శుభ్రం చేయకుండా కేవలం నీటితో కడిగి మళ్లీ వినియోగిస్తున్నారని అన్నారు. అలాగే పట్టణంలో కల్తీ పాలు తయారీ కూడా ఎక్కువగా జరుగుతున్నట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుని కొరుట్ల ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలని ఎంపీజే కోరుట్ల ఉపాధ్యక్షులు ఎం. ఏ. భారీ. కోరారు.