కొందుర్గ్. పోలీస్ స్టేషన్ కు వెళ్లే దారిలో సి సి రోడ్ నిర్మాణ పనులు

★ప్రజా పాలనలో గ్రామాలు అభివృద్ధి బాటలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏ కృష్ణ రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ చింతకింది సిద్దు మార్చి 14 2026, కొందుర్గ్ మండలం రంగారెడ్డి జిల్లా ఈరోజు కొందుర్గు మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ నుండి స్థానిక పోలీస్ స్టేషన్ చివరి వరకు. సీసీ రోడ్ పనులను ప్రారంభించటం జరిగింది. అయితే ఈ దారిలో గతంలో ఎన్నడు కూడాను సి సి రోడ్ లేకపోవటం వలన వర్షాకాలం ప్రజలు రాకపోకలు సాగించటంలో చాలా. ఇబ్బందుకు. గురయ్యే వారని స్థానిక. నాయకులు తెలిపారు. ఈ రోడ్ పరిస్థితిని స్టానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న కు తెలుపగానే తన ప్రత్యేక నిధుల సహకారంతో సిసి రోడ్ కు మంజూరుని ఇచ్చారని అందుకు గాను ఎమ్మెల్యే కు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రజా ప్రభుత్వంలో పేదలకోసం వారి అభివృద్ధికోసం ప్రభుత్వం ఎల్ల వేళల అభివృద్ధి ప్రణాళికలతో ముందుంటుందని వారు ఈసందర్భంగా ప్రజా ప్రభుత్వాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై రవీందర్ నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏ కృష్ణారెడ్డి పీ ఏ సి ఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి స్థానిక గ్రామ సర్పంచ్ చౌడపురం ప్రభాకర్ వార్డ్ సభ్యులు మరియు కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సిమెంట్ రాములు కాడిగళ్ల మహేందర్ జి బి కృష్ణ బోరుగె నరేందర్ బి.రవి శీలంవేణు కాంగ్రెస్ కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.