కేజీబీవీ సామ్రాజ్యం లో సంతోషం.. సాహిత్యం అంతా.. ఆ పెద్ద అమ్మదేనా…

★సీటు కావాలంటే చెయ్యి తడపాల్సిందేనా ★నీతి నియమం లేని ఆ అపరిచిత దళారే కీలకమా ★అంత మా ఇష్టం అన్నట్టుగా కేజీబీవీ నిర్వాకం

సాక్షి డిజిటల్ న్యూస్, కూడేరు మార్చి 14, అనంతపురం జిల్లా ఇన్చార్జ్ ముంగా ప్రదీప్ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కస్తూర్బా గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ గ్రామీణ వెనుకబడిన, పేద, మధ్యతరగతి విద్యార్థినీ కోసం ఉచిత వసతి ఉచిత విద్యను అందించే లక్ష్యంతో కేజీబీవీలను ప్రారంభిస్తే అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ ప్రధాని అధికారిని ప్రభుత్వ ఉత్తర్వులు నిబంధనలను తుంగలో తొక్కి అడిగేది ఎవరు అంత నా ఇష్టం ఉన్నట్టుగా కేజీబీవీ ప్రధాన అధికారిని వ్యవహరిస్తున్న తీరు చూస్తా ఉంటే గత కొన్ని సంవత్సరాలుగా సన్నిహితంగా మెలుగుతున్న ఒక నీతి, నియమం, లేని అపరిచిత దళారి పై ఆధారపడి కేజీబీవీలో నడుస్తున్న అవినీతి వ్యవహారం కాస్త ప్రజలను విష్మయానికి గురి చేస్తోంది. దాంతో ఆ పాఠశాల సామ్రాజ్యంలో సాహిత్యం సంతోషం… అంతా ఆ ప్రధాన అధికారినీదే కాగా వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు చదువుకోవాలన్న వారి ఆశయాలను నీరు కారుస్తూ విద్యకు దూరం చేస్తున్నారన్నా విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దాంతో ఎవరైనా విద్యార్థిని తల్లిదండ్రులు గాని లేదా మీడియా కున్నా సమాచారం మేరకు పాఠశాలలో కొనసాగు తున్నటువంటి అస్తవ్యస్త సౌకర్యాలు ఎక్కడ బయటకు వస్తాయోనని మీడియా కు పర్యవేక్షణ అనుమతి ఇవ్వకుండా ప్రధాన గేటు బయటే ఉంచి ఎవరికి లోనికి ప్రవేశం లేదంటూ లేనిపోని ఆంక్షలు విధిస్తూ అందరిని బెదరగొడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. విషయం ఏమిటంటే దళారిలో ఆరి తేరి పేరు మోసిన అపరిచిత వ్యక్తి కేజీబీవీ లో ప్రధాన అధికారిని ఆశ్రయించి ఆ ప్రధాన అధికారిని సామ్రాజ్యంలో జరుగుతున్న అవినీతి అక్రమాల బాగోతాన్ని బానిసగా చేసుకొన్న .. ఆ..అపరిచిత వ్యక్తి ఆ.. సామ్రాజ్య అధికారిని ఏకమై అవినీతి అక్రమాలకు తెర లేపినట్లు తెలుస్తోంది. కేజీబీవీ లో సీటు కావాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం ఒక విధానం అయితే ఇంటర్వ్యూ సమయానికి కేజీబీవీ లో సీట్లు ఖాళీగా లేవంటూ ప్లేటు ఫిరాయించి సీట్లు అన్ని భర్తీ అయిపోయాయి అంటూ నోటీసు బోర్డు వేయడంతో సీట్లు అన్ని ఖాళీ అయిపోయాయి అనుకుంటే మాత్రం పొరపాటే విద్యా సంవత్సరం మొదట్లో కాని లేదా విద్యా సంవత్సరం మధ్యలో కానీ ఖాళీ అయిన సీట్లను మరి భర్తీ చేయడం కోసం కేజీబీవీ అధికారిని తన అవినీతి బలాన్ని ప్రదర్శించుకుంటూ ఓ…నీతి నియమం లేని అపరిచిత దళారి ద్వారా మార్కెట్లో కాయగూరల వ్యాపారం మాదిరిగా కేజీబీవీ ప్రధాన అధికారిని దళారి ఏకమై ఒక్కో సీటుకు 10 వేల నుండి 25 వేల రూపాయల దాకా అవినీతి సొమ్మును వసూలు చేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతు సీట్లు విక్రయించు కుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.