
పయనించే సూర్యుడు మార్చి 14, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజాపూర్ మండలం కుచర్కల్ యూపీఎస్ పాఠశాలలో శుక్రవారం 'స్వయం పరిపాలన దినోత్సవం' ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. ప్రవీణ పర్యవేక్షణలో నిత్యం పాఠాలు వినే విద్యార్థులే నేడు ఉపాధ్యాయులుగా, అధికారులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను స్వీకరించారు.ఈ కార్యక్రమాని కి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి ఏ. సుధాకర్ హాజరయ్యి మాట్లాడుతూ, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు ,ఉపాధ్యాయ వృత్తిపై గౌరవం పెంపొందించడానికే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరం అన్నారు. స్వయం పరిపాలనలో భాగంగా హెడ్ మాస్టర్ ఏ. శ్రుతి ,జిల్లా విద్యాధికారి కె. బిందు,మండల విద్యాధికారి కె. మహేష్, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కె. శివ ప్రసాద్ ఆయేషా ఉపాధ్యాయులుగా, అధికారులుగా మారి పాఠశాలను నడిపించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఏ. సుధాకర్, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ సయ్యద్ ఇబ్రహీం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. ప్రవీణ, ఉపాధ్యాయులు విజయ లక్ష్మీ, సుజాత ,భాస్కర్, గ్రామ సర్పంచ్ జి. వెంకటయ్య గౌడ్, టి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వస్పుల కృష్ణయ్య, వార్డు మెంబర్ ఎర్ర నర్సింలు, కారోబార్ ఎర్ర యాదగిరి పాల్గొన్నారు.