కామారెడ్డిలో ఇద్దరు బాలికలమిస్సింగ్ కలకలం

సాక్షి డిజిటల్ న్యూస్, మార్చ్ :13, కామారెడ్డి జిల్లా ప్రతినిధి పిట్ల అనిల్ కుమార్, కామారెడ్డి లోని బాలసదనం నుండి శుక్రవారం తెల్లవారుజామున ఇద్దరు బాలికలు పరారయ్యారు. అయితే బాలసదనం కి చెందిన ప్రహరీ గోడను ఇటీవల కూల్చివేసి నూతనంగా నిర్మిస్తుండ‌టంతో ఆ గోడలో నుంచి బాలికలు పరారైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాలసదనం సూపరిండెంట్ సంగమేశ్వరి తెలిపారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ జరుపుతున్నారు. కామారెడ్డిలో మిస్సింగ్ కేసుల కలకలం.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మిస్సింగ్ కేసుల కలకలం సృష్టిస్తోంది. వారం రోజుల క్రితం ఆర్.బి నగర్, గోసంగి కాలనీకి చెందిన ఐదుగురు పిల్లలు మిస్సింగ్ కాగా అందులో ముగ్గురు తండ్రి చేతిలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన కామారెడ్డిలో సంచలనం సృష్టించిన విషయం విధితమే. కాగా తప్పిపోయిన మరో ఇద్దరు చిన్నారుల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. వీరి కోసం పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున బాలసదనం నుంచి ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యం కావడం కలకలం రేపుతుంది”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *