పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు రిపోర్టర్ ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 13 పెనుగంచిప్రోలు గ్రామంలో ని ఈరోజు న కుమ్మరి బజారులో కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కవయిత్రి మొల్లమాంబ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పాల్గొని స్థానిక నేతలతో కలిసి మొల్లమాంబ (మొల్ల) విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించిన కవయిత్రి మొల్లమాంబ రచించిన మొల్ల రామాయణం తెలుగు భాషకు గొప్ప ఆభరణమని తెలిపారు. సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా రామాయణాన్ని రచించి సాహిత్య రంగంలో చిరస్థాయిగా నిలిచిన మహనీయురాలని కొనియాడారు.
తెలుగు సాహిత్య సంపదను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, యువత కవయిత్రి మొల్లమాంబ జీవితం నుండి స్ఫూర్తి పొందాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పెనుగంచిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య మాజీ ఎంపీపీ వేగినేట్టీ గోపాలకృష్ణమూర్తి తిరుపతమ్మ దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్ సుంచు రమేష్ బాబు విజయవాడ పార్లమెంటరీ అధికార ప్రతినిధి నల్లమోల శివరామకృష్ణ ప్రసాద్. నీటి సంఘం అధ్యక్షులు కర్ల నాగేశ్వరరావు యనమందుల నాగేశ్వరరావు గ్రామ్ పార్టీ అధ్యక్షులు కొత్తపెళ్లి సతీష్ మాదినేని వెంకట్రావు మాజీ జెడ్పిటిసి సభ్యులు గజ్జి కృష్ణమూర్తి. గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్ లగడపాటి ప్రవీణ్ మాజీ ఎంపీటీసీ కాకాని బ్రహ్మం మాజీ సర్పంచ్ జిల్లేపల్లి సుధీర్ బాబు కెవిఆర్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ పేరెంట్స్ చైర్మన్ సముద్రాలు రామారావు బాడిశ కుటుంబరావు. నల్లపునేని కొండ బాడీశ చిన్న మీరయ్య కంభం చిరంజీవి ముసిబోయిన కృష్ణ. వరికళ్ళి గోపాలరావు. సంగిపు ఆంజనేయులు. సముద్రాల నరసింహారావు. ముసబోయిన ఆంజనేయులు ఎస్.కె చిన్న. తదితర కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.