సాక్షి డిజిటల్ న్యూస్, రిపోర్టర్ బొక్కానాగేశ్వరరావు మార్చి 14 2026 ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికచర్ల, వీరులపాడు మండలంలో భారీగా బాయిలర్ కోళ్ళ పెంపకం జరుగుతుంది. బాయిలర్ కోళ్ళ పెంపకం కోసం పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం వాడుతున్నారు నాయకుడు ఏటిపట్టి గ్రామానికి చెందిన నాయకుడు కొన్ని సంవత్సరాలుగా బాయిలర్ కోళ్ళ పెంపకం,కొంత మందికి కోళ్ళ మేత, రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారు పేదలకు డబ్బులు ఆశ చూపి బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న ఘనుడు బాయిలర్ కోళ్ళ పెంపకం కోసం ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో తక్కువ ఖర్చుతో వస్తున్న రేషన్ బియ్యాన్ని బాయిలర్ కోళ్ళకు మేతగా వేస్తున్నారు బాయిలర్ కోళ్ళ పెంపకం షెడ్డులో వందల టన్నుల రేషన్ బియ్యం నిల్వలు ఉన్నా సంబంధిత రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు అటూ వైపు చూడటం లేదు ఏ అధికారి కూడా నా కోళ్ళ పెంపకం షెడ్డుల దగ్గరకు రారు వారికి ఎవరైనా ఫిర్యాదు చేసినా అధికారులు నాకు సమాచారం ఇస్తారు అంటున్న బాయిలర్ కోళ్ళ పెంపకం వ్యాపార నాయకుడు.