ఏకె ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం

సాక్షి డిజిటల్ న్యూస్ మంచిర్యాల 14/3/2026, మార్చి నెలలోనే సూర్యభగవానుడు తన ఎండ ప్రతాపాన్ని చూపిస్తున్న తరుణంలో ఏకె ఫౌండేషన్ మంచిర్యాల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉచిత చల్లని మినరల్ వాటర్ ప్రజలకు అందించేందుకుగాను చలివేంద్రము ఏర్పాటు చేశారు మొదటిరోజు 150 లీటర్లకు పైగా చల్లని మజ్జిగ ఫౌండేషన్ అధ్యక్షురాలు లయన్ లత జెట్టి పంపిణీ చేశారు ఈ సందర్భంగా లయన్ లత జెట్టి మాట్లాడుతూ తన 16 సంవత్సరాల వయస్సు నుండి తనకు తోచిన విధంగా మరియు దాతల సహాయ సహకారంతో సమాజ సేవ చేస్తున్నానని ప్రతి సంవత్సరం చలివేంద్రం తప్పకుండా పెడుతున్నామని తెలిపారు మార్చి ఏప్రిల్ మే జూన్ మొదటి వారం వరకు చలివేంద్రంలో ఉచిత చల్లని మినరల్ వాటర్ అప్పుడప్పుడు కొన్ని ముఖ్యమైన సందర్భాలలో ఉచిత చల్లని మజ్జిగ కూడా ప్రజలకు అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షురాలు లయన్ లత జెట్టి చలువ పందిరి దాత ప్రసాద్ దంపతులు నేషనల్ బాడీ బిల్డర్ మిస్టర్ సింగరేణి కోల్ ఇండియా నాగమల్లేశ్వరరావు జెట్టి గిగ జిమ్ హైటెక్ సిటీ జిమ్ మహిళ స్టూడెంట్స్ శ్రీలత అనుష దీపిక ట్రైనర్ సాయి లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ లయన్ కిరణ్ కుమార్ జోన్ చైర్ పర్సన్ లయన్ వెంకటేశ్వర్లు లయన్ సెక్రటరీ లయన్ శివప్రసాద్ సీనియర్ అడ్వకేట్ లయన్ లచ్చన్న లయన్ ప్రభాకర్ ప్రజలు మరియు పాదచారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *