ఎన్‌ఆర్‌జీఎస్ నిధులతో మంగనూరులో సీసీ రోడ్ల పనుల ప్రారంభం

*సిసి రోడ్ల పనులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ జాల నాగయ్య ఉపసర్పంచ్ చంద్రశేఖర్

పయనించే సూర్యుడు మార్చి 14 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ ; బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలోని 10వ వార్డులో ఎన్‌ఆర్‌జీఎస్ పథకం కింద రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఈరోజు ప్రారంభించారు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సహకారంతో గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు ఈ పనులు చేపట్టినట్లు రాజేష్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాల నాగయ్య, ఉప సర్పంచ్ చంద్రశేఖర్, శరత్ చంద్ర, రమేష్ పాల్గొని పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పనులు చేపడుతున్నామని తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణంతో గ్రామ ప్రజలకు రాకపోకలు మరింత సులభంగా మారనున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాల నాగయ్య, ఉపసర్పంచ్ చంద్రశేఖర్, వార్డ్ మెంబర్లు శరత్ చంద్ర, రమేష్, జాలం కృష్ణయ్య, రామంజి, గడ్డపార శివ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి, సతీష్ అలాగే గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *