ఎంజెపి బిసి గురుకుల పాఠశాలకు శాశ్వత భవనం నిర్మించాలని ఎమ్మెల్యే కు వినతి పత్రం

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 14 అచ్చంపేట రిపోర్టర్(కొమ్ము రేణయ్య)ఎంజెపి బిసి గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనం నిర్మించాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కు వినతి పత్రం సమర్పించారు. అచ్చంపేటలోని జెయంజె స్కూల్ లో నడుస్తున్న మహాత్మా జ్యోతి పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్(వెల్టూర్) భవనాన్ని ఖాళీ చేయమని యాజమాన్యం ఒత్తిడి తెస్తుండటంతో ప్రస్తుతం అందులో చదువుతున్న సుమారు 500 మంది బాలికల భవిష్యత్తు ప్రస్తుతం అనిశ్చితిలో పడిందని విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు. ఈ సమయము లో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు అన్నారు. ప్రస్తుతం పరీక్షల సమయం కొనసాగుతున్న నేపథ్యంలో భవనం ఖాళీ చేయాల్సి వస్తే విద్యార్థుల చదువుకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందని తెలిపారు.500 మంది బాలికలకు ఒక్కసారిగా సురక్షితమైన వసతి కల్పించడం చాలా కష్టమని సరైన సౌకర్యాలు లేని చోటుకు తరలిస్తే వారి భద్రత మరియు ఆరోగ్యానికి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు. కావున ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సమస్యకు పరిష్కారం చూపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రస్తుతం ఈ భవనంలోనే పాఠశాల కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని వారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి బుక్కాపురం మహేష్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు డ్యాగ అనిల్, పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు ఆల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.