సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 14 ప్రతినిధి, తూప్రాన్ మున్సిపాలిటీ నాలుగో వార్డ్ లో ఫ్రైడే డ్రై డే లో భాగంగా శుక్రవారం ఉదయం అధికారులతో పారిశుద్ధ కార్మికులతో నాలుగో వార్డుల్లో పరిశుభ్రతను పరిశీలించిన కౌన్సిలర్ జైపాల్ నాయక్ మాట్లాడుతూ వాడెక్క పరిశుభ్రత ముఖ్యమని వార్డులోని అన్ని సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తానని ముఖ్యంగా ప్రజలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారని చుట్టుపక్కల పరిశుభ్రత ఉంచాలని అప్పుడు ప్రజల ఆరోగ్య భద్రత ఉంటుందని అందుకని అందరూ సమయస్ఫూర్తితో సహకరించి వార్డు యొక్క అభివృద్ధికి తోడ్పడాలని ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమానికి విజయవంతం చేయాలని నాలుగో వార్డ్ యువకులకు మహిళలకు నాయకులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వార్డ్ స్పెషల్ ఆఫీసర్ జూనియర్ అసిస్టెంట్ ప్రసన్నకుమార్ అంగన్వాడి వర్కర్ తదితరులు పాల్గొన్నారు.
