ఈద్గా అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 13 జగ్గయ్యపేట పట్టణంలోని బలుసుపాడు రోడ్డులో గల ఈద్గా ప్రాంగణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు మరియు వరదల కారణంగా ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించే నమాజు స్థలం, సీసీ రోడ్డు, ప్రహరీ గోడ దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని స్థానిక ముస్లిం మైనార్టీ నాయకులు జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) దృష్టికి తీసుకువచ్చారు.దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తమ కృషితో డిఎంఎఫ్ నిధుల నుంచి రూ.18 లక్షలు మంజూరు చేయించి, నమాజు స్థలం అభివృద్ధి, సీసీ రోడ్డు నిర్మాణం మరియు వరదలను తట్టుకునే విధంగా ఐరన్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రారంభమైన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఈరోజు స్థానిక ముస్లిం మైనార్టీ నాయకులతో కలిసి ఈద్గా ప్రాంగణంలో పరిశీలించారు. పనులు నాణ్యతగా, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర , కమిషనర్ తులసి కృష్ణారావు మరియు వివిధ హోదాలలో ఉన్న ముస్లిం మైనార్టీ నాయకులు, పార్టీ నాయకులు, మరియు అధికారులు పాల్గొన్నారు.