సాక్షి డిజిటల్ న్యూస్ హనుమకొండ జిల్లా.14/3/2026 సాక్షి డిజిటల్ న్యూస్ పరకాల నియోజకవర్గం రిపోర్టర్ మడికొండ పవన్ కుమార్ ఇసుక మాఫియా స్మగ్లర్లు ఇసుకను తోడేస్తున్నారు జిల్లా ను దాటి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కాల్వపల్లి నుంచి ఇసుకాసురులు హనుమకొండ జిల్లా పరకాల కేంద్రానికి తరలిస్తూ పరకాలను కేంద్రంగా చేసుకున్నారు ఈ క్రమంలో చిట్యాల మండలంలో టేకుమట్ల పది ట్రాక్టర్లు చిట్యాల ఎనిమిది ట్రాక్టర్లు రేగొండ పద మూడు ట్రాక్టర్లు మండలంలోని రేపాక పది ట్రాక్టర్లు కనపర్తి గ్రామా నీ కి చెందిన ఎనిమిది ట్రాక్టర్లు పరకాల పైడిపల్లి తాళ్లు సీఎస్ఐ కాలనీ మీదుగా పరకాల పట్టణం లోకి తరలిస్తున్నారు అయితే ప్రజలు ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్ల లో డ్లతో అర్థరాత్రి మరియు తెల్లవారుజామున నరకయాతన అనుభవిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పరకాల లోని ఒక రహస్య ప్రదేశంలో ఇసుక డంపు చేసి అవసరం మేరకు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం ఈ అక్రమ దందాకు ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సరఫరా చేస్తున్నామనే ముసుకు వేయడం గమనార్వం ఇదంతా బహిరంగంగా జరుగుతున్నాయి అన్న ఉదంతం అయినా రెవెన్యూ అధికారులు సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం వెనుక పలు అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు కాగా ఈ అక్రమ దందాకు కళ్లెం వేసేది ఎవరని పరకాల సీఎస్ఐ కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు…
