ఆయిల్ పేడ్ ఫ్యాక్టరీ సందర్శన శిక్షణ మరియు మార్కెటింగ్ అవగాహనకు వెళుతున్న రైతులు

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టార్ భైరం నారాయణ 14 మార్చి 2026, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ వారి ఆధ్వర్యంలో రైతు విజ్ఞాన యాత్ర శిక్షణ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులు సిద్దిపేట జిల్లా నరిమెట్టలో ఆయిల్ ఫేడ్ ఫ్యాక్టరీ సందర్శన, శిక్షణ మరియు మార్కెటింగ్ అవగాహన కార్యక్రమానికి వెళుతున్న బస్సును జెండా ఊపి ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో మారుతున్న నూతన సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయ సాగుచేయాలి రైతులు వ్యవసాయ సాగు లో ఆదాయం అర్జించాలంటే మార్కెట్ పరిస్థితులు అర్థం చేసుకొని డిమాండ్ ఉన్న పంటల వైపు మొగ్గు చూపాలి . నేడు దేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న పంట ఆయిల్ ఫామ్ సాగు. ఆయిల్ ఫామ్ లో అంతర పంటలు సైతం సాగు చేపట్టి రైతులు ఆదాయం పొందవచ్చు అన్నారు. జిల్లా రైతులు ఆయిల్ ఫామ్ సాగు పై దృష్టి సారించాలని అన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి అన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మ ఛైర్మెన్ కాటిపెల్లి గంగారెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీమతి లత ,సాంకేతిక ఉద్యాన అధికారి శ్యాంప్రసాద్ ,హార్టికల్చర్ అధికారి స్వాతి,జిల్లా రైతులు తదితరులు పాల్గొన్నారు.