ఆపరేషన్ కవచ్ లో భాగంగా జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ఆకస్మిక తనిఖీలు …

సాక్షి డిజిటల్ న్యూస్, మార్చ్:14 కామారెడ్డి జిల్లా ప్రతినిధి పిట్ల.అనిల్ కుమార్, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు చేపట్టిన ఆపరేషన్ కవచ్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర .గురువారం అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది తీరును పర్యవేక్షించారు. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాప్లిన్ డివైస్ ద్వారా 285 మందిని తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఓ డీసీఎం వ్యాను ఆపి డ్రైవర్​కు డ్రంకన్​ డ్రైవ్​ పరీక్షల. చేశారు. అతడికి 210 పర్సెంటేజ్ వచ్చింది. దీంతో కేసు నమోదు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. మద్యం సేవించి బాధ్యతా రాహిత్యంగా వాహనం నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు. జరుగుతున్నాయని పేర్కొన్నారు. అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం నిరంతరం డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నట్టు ఎస్పీ పేర్కొన్నారు. ఆపరేషన్ కవచ్​.లో భాగంగా మొత్తం 305 మందిని తనిఖీ చేయగా 14 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. అనంతరం సిరిసిల్ల రోడ్డులో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందితో కలిసి అర్ధరాత్రి టీ, స్నాక్స్ తీసుకున్నారు. ఈ తనిఖీలలో ఏఎస్పీ చైతన్య రెడ్డి . కామారెడ్డి పట్టణ సీఐ నరహరి, మాచారెడ్డి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, నస్రుల్లాబాద్, బాన్సువాడ ఎస్సైలు అనిల్, పుష్పరాజ్, మహేష్, రాఘవేంద్ర, రాములు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *