ఆధ్యాత్మికత మానవతకు మహిళాసాధి కారతకు, ఐక్యతకు నిదర్శనం

★ఆతుకూరి మొల్ల మాంబ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించలనిరాష్ట్ర కోశాధికారి నమిలికొండ ప్రభాకర్

పయనించే సూర్యుడు మార్చి 14 కరీంనగర్: తెలంగాణ కుమ్మర సంఘం కరీనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అతుకూరి మొల్ల మాంబ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర కోశాధికారి నమిలి కొండ ప్రభాకర్ మాట్లాడుతూ మొల్ల సామాన్య కుమ్మర కులంలో జన్మించిన 16వ శతాబ్దంలోనే స్వయంగా చదువుకుని సంస్కృతంలోని రామాయణంను తెలుగులో సరళ సుందరంగా రచించి ఆదర్శంగా నిలిచారన్నారు.మొల్ల తాత తిక్కన దగ్గర లేఖకునిగా పనిచేశారని పండిత కుటుంబానికి చెందిన మొదటి మహిళా కవయిత్రి అన్నారు. మొల్ల రచనలను నేటి తరానికి అందించ వలిసిన అవసరం మనపై ఉందని, బి.సి వర్గాల సాహిత్య వేత్తల ద్వారా సామాజిక, ఆధ్యాత్మిక చైతన్యానికి కృషి చేయడం వల్ల మొల్ల రామాయణం విశిష్టత విశేషాలను,రచనాశైలి గురించి అవగాహన సదస్సులు నిర్వహించా లన్నారు. బి.సి బహుజన సామాజిక వర్గంలో విశేష సేవలందించి న వారికి ,మేధావులకు ,రచయితలకు మొల్ల పేరున అవార్డులు ఇచ్చి ప్రోత్సాహించాలన్నారు. కోరేపు లక్ష్మయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొల్ల జయంతి,వర్ధంతినీ అధికారికంగా జరుపడంతో పాటు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మొల్ల పేరుతో అవార్డులు అందించాలనీ,మొల్ల సమగ్ర చరిత్రను రచింపజేసి ప్రచురించాలని ,ప్రభుత్వ భవనాలకు, పథకాలకు ,సంస్థలకు మొల్ల పేరు పెట్టాలన్నారు. మొల్ల విగ్రహాలు ప్రతిష్టాత్మకంగా పెట్టాలని, మహిళా విశ్వవిద్యాలయానికి మొల్ల పేరు పెట్టాలన్నారు ఈజయంతి కార్యక్రమంలో తెలంగాణ కుమ్మర సంఘం కరీనగర్ జిల్లా బాధ్యులు రాధారపు శ్రీనివాస్, మల్లేష్, సదానందం, అంజలి, రేణుక, రవీందర్ శంకర్ ,శ్రీనివాస్,మోహన్,మరియు కుమ్మర కుల బంధువులు తదితరులు హాజరయ్యారు