ఆదోనిలో ప్రసూన గ్యాస్ట్రో&పీడియాట్రిక్ కేర్ ప్రారంభం.

పయనించే సూర్యుడు మార్చి 14 కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్ :ఆదోని పట్టణంలో ఎస్కేడీ కాలనీ జీరో రోడ్డు నందు నూతనంగా ఏర్పాటు చేసిన ప్రసూన గ్యాస్ట్రో పీడియాట్రిక్ కేర్ ఆసుపత్రిని శుక్రవారం ఎమ్మెల్యే పార్థసారధి ప్రారంభించారు. ఇక్కడ గ్యాస్ట్రో నిపుణులు డాక్టర్ ప్రసూన, శిశు వైద్య నిపుణులు డాక్టర్ హరిహరన్ యూ కె అనుభవం 24 గంటల పాటు అందుబాటులో ఉండి అత్యాధునిక చికిత్స అందిస్తారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం కోరింది. గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.సి.హెచ్.ప్రసూన మాట్లాడుతూ అన్నవాహిక, కడుపు, చిన్న ప్రేగు, పెద్దప్రేగు, పురీషనాళం, క్లోమం, పిత్తాశయం, పిత్త వాహికలు మరియు కాలేయంతో సహా జీర్ణవ్యవస్థను ప్రభావితం చేసే పూర్తి స్థాయి రుగ్మతలను నిర్ధారించడం మరియు చికిత్స చేయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. పెడియాట్రిక్ డాక్టర్ పి.హరిహరన్ మాట్లాడుతూ పురిటి పిల్లలు మరియు చిన్నపిల్లలో బరువు తక్కువగా పుట్టిన పిల్లలకు, ఉమ్మనీరు మింగిన కేసులు, వాంతులు ,విరోచనాలు, నిమోనియా, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, పసిరికలు, చికెన్ గున్యా, మూర్చ వ్యాధి అన్ని రకాల విష జ్వరాలకు ప్రత్యేకంగా చూడబడుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *