పయనించే సూర్యుడు మార్చ్ 14 ఆదోని రూరల్ రిపోర్టర్ : కష్టపడితేనే కడుపు నిండని ప్రస్తుత పరిస్థితుల్లో, పోలీసుల భారీ జరిమానాలు తమ బతుకులను ఛిన్నాభిన్నం చేస్తున్నాయని ఆదోని మండలం గణేకల్లు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కుప్పయ్ తిమ్మప్ప సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీటి పర్యంతమవుతూ ఆయన విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో, స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి తక్షణమే స్పందించారు.జరిమానాల మోత.. పేదల బతుకు ఆగమ్యగోచరంతిమ్మప్ప తన గోడును వెళ్లబోస్తూ.. రోజంతా కష్టపడితే కేవలం రూ. 400 నుండి 500 మాత్రమే లభిస్తోందని, అందులో సింహభాగం పోలీసుల జరిమానాలకే సరిపోతోందని వాపోయారు. తన తల్లి కూలీ పనికి వెళ్లి సంపాదించే రూ. 200 తో కలిసి అతికష్టం మీద ఇల్లు గడుస్తోందని, ఇలాంటి స్థితిలో భారీ పెనాల్టీలు వేస్తే పేదలు ఎలా బతకాలని ఆయన అధికారుల ను ప్రశ్నించారు. అధికారులకు మానవతా దృక్పథం ఉండాలని కోరుతూ ఆయన చేసిన వీడియో ప్రజల మనసులను కలిచివేసింది. నేరుగా వెళ్లి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యేఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పార్థసారథి, తిమ్మప్పను వారి ఇంటికి వెళ్లి ఆయన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ పక్కన కూర్చుని, ఆయన భుజం తట్టి ధైర్యం చెప్పారు.భరోసా: "ప్రభుత్వ యంత్రాంగం పేదలను ఇబ్బంది పెట్టకూడదని, నిబంధనల పేరుతో సామాన్యుల పొట్ట కొట్టడం సరికాదని" ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. తిమ్మప్ప లాంటి కష్టజీవులకు అన్యాయం జరగకుండా చూస్తామని, ఈ విషయాన్ని సీఎం,డీసీఎం,ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి జరిమానాల వేధింపులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.ఆపదలో ఉన్న సామాన్యుడి పిలుపునకు స్పందించి, నేరుగా వచ్చి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యేపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.