అశ్వాపురం మండల కేంద్రంలో గల పదవ తరగతి పరీక్షా కేంద్రం లో సౌకర్యాలను పరిశీలించిన ఎం పీ డీ ఓ

సాక్షి డిజిటల్ న్యూస్,మార్చి 14,అశ్వాపురం: అశ్వాపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.ముత్యాల రావు. శనివారం నుండి పదవ తరగతి పరీక్షలు మొదలవుతున్నందున పరీక్ష కేంద్రం నందు సదుపాయాలను పరిశీలించి తగు సూచనలు సలహాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్, ఉప సర్పంచ్ తుళ్ళూరీ ప్రకాష్ రావు, పాఠశాల హెడ్ మిస్ట్రెస్, పంచాయతీ కార్యదర్శి కందిమళ్ల శ్రీకాంత్ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.