అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అమ లు చేస్తున్న అన్నదాత సుఖీభవ మూడో విడత, 22 వ పీఎం కిసాన్ పథకం క్రింద అర్హులైన ప్రతిఒక్కరికీ లబ్ధి చేకూర్చడం జరుగు తుందని

*జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడిం చారు

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 14, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు . జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్స రంలో మూడో విడత అన్నదాత సుఖీభవ 22 వ విడత పిఎం కిసాన్ నిధులు జిల్లా వ్యాప్తంగా 1, 34,829 అన్నదాతల కు టుంబాలకు రూ 77.01 కోట్లు జమ కాబడి లబ్ధి చే కూరిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అన్నదాతలు ఈ యొక్క నిధులను సద్వినియోగం చేసుకుని వ్యవసాయాన్ని లాభసా టిగా మార్చుకోవాలన్నారు అన్నదాత సుఖీభవ కింద ప్రస్తుత మూడో విడత లో1,34,829 రైతు కుటుం బాలకు రూ.4 వేలు చొప్పున రూ 53.93 కోట్లు మేర లబ్ధి చేకూరిందని అదేవిధంగా 22 విడత పిఎం కిసాన్ కింద రూ 2 వేలు చొప్పున జిల్లావ్యా ప్తంగా1,15,400 రైతు కుటుంబాలకు రూ 23.08 కోట్లు మేర నిధులు జమ కాపడ్డాయన్నారు. అమలా పురం నియోజకవర్గం లో అన్నదాత సుఖీభవ కింద 13,403 రైతు కుటుంబా లకు రూ 4 వేలు చొప్పున రూ.5.36 కోట్లు, పీఎం కిసాన్ కింద రూ2 వేలు చొప్పున 12,432 రైతు కుటుంబాలకు రూ 2.49 కోట్లు జమ కాబడ్డాయ న్నారు, కొత్తపేట నియోజ కవర్గంలో అన్నదాత సుఖీ భవ కింద 23,085 రైతు లకు రూ 9.23 కోట్లు, పీఎం కిసాన్ కింద 18,546 రైతులకు రూ.3.71 కోట్లు, మండపేట నియోజకవర్గం లో అన్నదాత సుఖీభవ కింద 18,282 రైతులకు రూ.7.31 కోట్లు, పీఎం కిసాన్ కింద 16,339 రైతులకు రూ 3.71 కోట్లు, ముమ్మిడివరం నియోజక వర్గంలో అన్నదాత సుఖీ భవ కింద 19,519 రైతులకు రూ.7.81 కోట్లు, పీఎం కిసాన్ కింద 14,615 రైతులకు రూ 14,615 రైతులకు రూ 2.92 కోట్లు, పి గన్నవరం నియోజక వర్గంలో అన్నదాత సుఖీ భవ కింద 23,796 రైతు కోట్లు రూ 9.52 కోట్లు, పీఎం కిసాన్ కింద 21,483 రైతులకు రూ 4.30 కోట్లు, రామచంద్రపురం నియో జకవర్గంలో అన్నదాత సుఖీభవ క్రింద 15,272 రైతులకు రూ 6.11 కోట్లు, పీఎం కిసాన్ కింద 14,402 రైతులకు రూ2.88 కోట్లు, రాజోలు నియోజకవర్గం లో అన్నదాత సుఖీభవ కింద 21,472 రైతులకు రూ.8.59 కోట్లు, పీఎం కిసాన్ కింద 17,583 రైతులకు రూ.3.52 కోట్లు జమ కాపడ్డాయన్నారు అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు అందుతున్న ఆర్థిక సహాయం రైతుల ఆర్థిక స్థిరత్వానికి, వ్యవసాయ రంగ బలోపేతానికి దోహదం చేస్తుందన్నారు. రైతులు పంటలు వేసే నాటికి అవసరమైన పెట్టుబడి సాయం. అందించడం ద్వారా అన్నదాతల క్షేమం సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. రైతులకు రుణభారం లేకుండా చేయడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించ డంలోనూ ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తోందని వివరించారు. వ్యవసాయ యోగ్యమైన సొంత భూమి కలిగి ఉన్న రైతు కుటుంబా లకు భూవిస్తీర్ణంతో సంబం ధం లేకుండా మరియు అటవీ హక్కుల గుర్తింపు భూములు సాగు చేస్తున్న రైతు కుటుంబానికి పెట్టుబడి సాయంగా సంవత్సరానికి మూడు విడతలుగా కేంద్ర ప్రభు త్వం అందిస్తున్న రూ.6000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ. 14,000 చొప్పున మొత్తంగా అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ కింద ఏడాదికి మొత్తం రూ.20,000 చొప్పున ఆర్ధిక మద్దతు కల్పిస్తు న్నట్లు వివరించారు. ఈ పథకం ద్వారా అందుతు న్న ఆర్థిక సహాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. నిధులను ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాలు జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 7 నియోజ కవర్గంలో జరిగాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *