పయనించే సూర్యుడు మార్చి 14, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి)కాకినాడరూరల్, పరిశ్రమలు ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపిఐఐసి అధికారులకు పిజిఆరఎస్ ద్వారా పిర్యాదు చేసినందుకు చర్యలు తీసుకోకపోగా పారిశ్రామిక వేత్తలతో ఏర్పాటు చేసిన సమావేశానికి రావాలంటూ అధికారులు పిలిచి పారిశ్రామిక వేత్తలతో అవమానించే విధంగా మాట్లాడించారని టిడిపి నాయకులు, మాజీ కార్పోరేటర్ యాదగిరి సత్యన్నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సత్యన్నారాయణ మాట్లాడుతూ తాను చిన్న నాటి నుండి పారిశ్రామిక వాడ సమీపాన ఉండే మురళీధర్ నగర్‌లో నివసిస్తున్నారు. తన కళ్ళెదురుగానే ఏపిఐఐసి ఏర్పాటు చేసి పరిశ్రమల ఏర్పాటు జరిగిందన్నారు. ప్రస్తుతం ఏపిఐఐసి పారిశ్రామిక వాడలో కనీస ప్రమాణాలు కూడా పాటించడంలేదని, ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం అధికంగా ఉంటుందని దీనిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గత ఏడాది మార్చి నుండి మూడు సార్లు కలెక్టర్ పిజిఆరఎస్‌లో పిర్యాదు చేయడం జరిగిందన్నారు. పిర్యాదు చేసిన ప్రతీ సారి 3నెలలో చర్యలు తీసుకునే విధంగా నోటీసులు ఇచ్చామని అధికారులు చెప్పడమే తప్ప ఏ విధమైన చర్యలు తీసుకో లేదన్నారు. దీనిపై గత రెండు రోజుల క్రితం అధికారుల వైఖరిపై పాత్రికేయులకు చెప్పడం జరిగిందన్నారు. దీనిపై స్పందించిన పాత్రికేయులు పలు పత్రికల్లో తన ఆరోపణలను ప్రచురించడం జరిగిందన్నారు. దీంతో శుక్రవారం తాను పనిలో ఉండగా పారిశ్రామిక వేత్తలతో అత్యవసర సమావేశం ఉందని, మీరు కూడా హాజరు కావాలని తనను పిలవడం జరిగిందన్నారు. ఎన్ని సార్లు పిలిచినా ఏం లాభమని, చర్యలు తీసుకుని తనకు చెబితే చాలని సమాధానమిచ్చినా ససేమిరా అంటూ ఇబ్బంది పెట్టడంతో సమావేశానికి హాజరయ్యేందుకు ఏపిఐఐసి కార్యాలయానికి వెళ్లడం జరిగిందన్నారు. సమావేశానికి 10నుండి 15మంది హాజరయ్యారన్నారు. అధికారులు మాట్లాడుతుండగా పారిశ్రామిక వేత్తల్లో ఒకరొకరుగా లేచి తనను ప్రశ్నించారన్నారు. మమ్మల్ని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని ప్రశ్నించడంతో తనకు ఏం మాట్లాడాలో అర్దం కాలేదన్నారు. ప్రమాణాలు పాటించకపోతే ప్రమాదాలు జరిగి ప్రణాలు పోతాయని చెప్పడం తప్పా అని వారిని నిలదీశానన్నారు. ఎవరితో తనకు వ్యక్తిగతంగా పరిచాయలు గాని, శత్రుత్వంగాని లేదని, ప్రమాణాలు పాటిస్తూ పారిశ్రామిక వేత్తలు వ్యాపారాలు చేసుకుంటే అందరికీ మంచిదని చెప్పానన్నారు. అయినా మీకు ఎటువంటి పిర్యాదు చేయలేదు కదా, నేను ఏపిఐఐసి అధికారులకు పిర్యాదు చేసానని, వారికి సమాధానం చేప్పాలి గాని, మీరు నన్ను ప్రశ్నించే హక్కు లేదని అక్కడనుండి వచ్చేసానని చెప్పారు. తన పని తాను చేసుకుంటే ఆకారణంగా పిలిచి తనకు సంబందం లేని వ్యక్తులు ప్రశ్నిస్తున్నా, సర్ది చెప్పడం మాని ఏపిఐఐసి జెడఎం చోద్యం చూస్తున్నారని పిర్యాదుదారుడు ఆరోపించారు. జరిగిన సంఘటనపై సోమవారం మరో మారు పిజిఆరఎస్‌లో పిర్యాదు చేస్తానని పిర్యాదు దారుడు యాదగిరి సత్యన్నారాయణ పాత్రికేయులకు చెప్పడం జరిగింది. ప్రమాణాలు పాటించమని చెప్పడం కూడా ఈ రోజుల్లో తప్పుగా కనిపిస్తుంది. ఏపిఐఐసిలో చాలా పరిశ్రమలు ఉండగా కేవలం 10నుండి 15మంది మాత్రమే హాజరు కావడం పట్ల పలుఅనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుమారు 100దాటి పరిశ్రమలు ఉండగా అందులో కనిసం 15శాతం మాత్రమే పరిశ్రమలు పనిచేయడమేమిటి, మిగిలిన పరిశ్రమలు ఉన్నాయా లేదా….అసలు నడుస్తున్న పరిశ్రమలకు అనుమతులు ఉన్నాయా లేదా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.