అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలోఎఫ్ సి ఐ కాలనీ పార్కులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు,మార్చి 13 రంగారెడ్డిజిల్లాప్రతినిధి (ఎస్ఎంకుమార్) మియాపూర్ 240 డివిజన్ పరిధిలోని ఎఫ్ సి ఐ కాలనీ పార్కులో అంతర్జాతీ య మహిళా దినోత్సవాన్ని పురస్కరిం చు కుని మహిళల కోసం ప్రత్యేక కార్యక్ర మాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో,ట్రస్ట్ చైర్మన్ కార్యక్రమ నిర్వాహకుడు అట్టే పల్లి రామప్రభు సమక్షంలో నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలలో ఆత్మవిశ్వా సాన్ని పెంపొందించేందుకు మరియు వినోదాన్ని అందించేందుకు మ్యూజికల్ చైర్, ప్రొటెక్ట్ యువర్ బెలూన్, ఫిల్ ది వాటర్ బాటిల్, తగ్ ఆఫ్ వార్ వంటి వినోదాత్మక ఆటలను నిర్వహించారు. పోటీల్లో విజేతలకు మొదటి బహుమ తిగా రూ.5,000 విలువైన గిఫ్ట్, రెండవ బహుమతిగా రూ.3,000 విలువైన గిఫ్ట్ ప్రకటించారు. అలాగే పాల్గొన్న మహి ళలందరికీ ప్రోత్సాహక బహుమతులు కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా అట్టేపల్లి రామప్రభు మాట్లాడుతూ మహిళలు కుటుంబ వ్యవస్థకు మూలస్తంభాలని, వారి కృషి వల్లనే సమాజం సుస్థిరంగా నిలుస్తుందని తెలిపారు. మహిళలకు గౌరవం,అవకా శాలు ప్రోత్సాహం అందించడం ద్వారా సమాజం మరింత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణలో జయంశంకర్, విజయ్, శంకర్,సు రేష్, బాబ్జి,చంద్రిక,సువీణ సింధూ ర,రాజేశ్వరి, మానస, ప్రీతి,అరుణ, సుమలత, నర్మద ఎఫ్ సి ఐ, కాలనీ, చిరంజీవి నగర్, అమన్ కాలనీ, ఎస్సా ర్ ఎస్టేట్స్, టిఎన్ పిఎన్ నగర్, పోట్లపల్లి రెసిడెన్సీ, హేమదుర్గ అపార్ట్‌మెంట్స్ కమిటీ సభ్యులు, ARP టీమ్ సభ్యులు, కాలనీ మహిళలు, పిల్లలు మరియు నివాసితులు కలిసి భాగస్వామ్యం అయ్యారు. సుమారు 500 మందికి పైగా సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహిళల ఆనందోత్సాహాల మధ్య ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది