అంతా నా ఇష్టం అంటున్నా చిలకల డోన స్కావెంజర్ చూసి

★చూడనట్లుగా వ్యవహరిస్తున్న హెచ్ఎం కృష్ణవేణి చిలకలడోన★హెచ్ఎం కృష్ణవేణి ను సస్పెండ్ చేయాలనీ విద్యార్థి సంఘాల డిమాండ్..

పయనించే సూర్యుడు మార్చి 14ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ : అధికార పార్టీ నాయకుల అండ దండలతోనే ఇష్టానుసారంగా సారంగా వ్యవహరిస్తున్న స్కావెంజర్ మాణిక్యమ్మను వెంటనే సస్పెండ్ చేయాలి….కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం పరిధిలో గల చిలకలడోన గ్రామంలో ఎస్సీ కాలనీ నందు ఎంపీపీ స్కూల్లో స్కావెంజర్గా పనిచేస్తున్న మాణిక్యమ్మను వెంటనే సస్పెండ్ చేయాలి.గతంలో పిల్లల చేత పని చేయిస్తున్న స్కావెంజర్ కొనసాగించకూడదని ఆందోళన కార్యక్రమం చేసినా కూడా ఆమెపై చర్య ఎందుకోసం తీసుకోలేదని అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి పిల్లల చేత క్లీనింగ్ పని చెత్త పని చేయించిన కూడా గోప్యంగా ఉంచిన హెచ్ఎం కృష్ణవేణి ఆమెపై ఎందుకో అంత ఎనలేని ప్రేమ ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ హెచ్ఎం కృష్ణవేణి విద్యార్థుల చేత పనిచేయడం నేరమని తెలిసినా కూడా విద్యార్థులు విద్యార్థుల చేత పనిచేయించిన ఎందుకు గోప్యంగా ఉంచారనీ వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే హెచ్ఎం కృష్ణవేణి ను స్కావెంజర్ మాణిక్యమను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.