పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 14 బోధన్ : అంగన్వాడీల నిర్వాహకులుపిల్లలు,గర్భిణీలు,బాలింతలకు తప్పనిసరిగా ప్రభుత్వ నియమాలను అనుసరిస్తూ పౌష్టికాహారాన్ని అందించాలని సాలూర మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజకుమార్ ఆదేశించారు.శుక్రవారం డాక్టర్ సాలూర అంగన్వాడి కేంద్రం 2 ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.పిల్లలతో పాటు గర్భిణీలు బాలింతలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి సూచనలు సలహాలు తీసుకొని జాగ్రత్తలు పాటించాలని సూచించారు.అంగన్వాడీ కేంద్రంలో సౌకర్యాలను గురించి టీచర్ ను అడిగి తెలుసుకున్నారు. అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉండడంతో డాక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ గోదావరి తదితరులు ఉన్నారు.