యర్రగొండపాలెం ఎస్‌ఐగా దేవ కుమార్ బాధ్యతల స్వీకరణ:

*అంబేద్కర్ చిత్రపటంతో సత్కరించిన దళిత నాయకులు

(సాక్షి డిజిటల్స్) రాము యర్రగొండపాలెం ఆర్ సి ఇంచార్జ్ : యర్రగొండపాలెం, యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్‌ఐ) గా ఎం. దేవ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దళిత ఉద్యమ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుని, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రముఖ దళిత నాయకులు మెడబలిమి అచ్చుతరావు ఆధ్వర్యంలో పలువురు నాయకులు ఎస్‌ఐ దేవ కుమార్ ను కలిసి, ఆయనకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని బహుకరించి ఘనంగా సత్కరించారు. నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు, అలాగే దళితులు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి నూతన ఎస్‌ఐ చొరవ చూపాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అచ్చుతరావు తో పాటు గుంటి అక్షయ్ కుమార్, వెంకటేశ్వర్లు, చంటి, గాలెయ్య, అచ్చిబాబు, రాము తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *