(సాక్షి డిజిటల్ రిపోర్టర్ విగ్నేష్ మార్చి 04) దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట గ్రామంలో రంజాన్ పర్వ దినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గురువుగారి ప్రవీణ్, బి.మరి స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. రంజాన్ పవిత్ర పండగ సందర్భంగా గ్రామంలోని ముస్లిం కుటుంబాలకు ప్రేమ, సౌభ్రాతృత్వం మరియు ఐక్యతకు ప్రతీకగా ఈ విందు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉపవాస దీక్షలు ముగించుకున్న ముస్లిం సోదరులకు రుచి కరమైన వంటకాలతో విందు వడ్డించారు. ఈ సందర్భంగా గురువుగారి ప్రవీణ్ మాట్లాడుతూ, రంజాన్ పండగ సమాజంలో సోదరభావాన్ని పెంపొందించే పర్వదినమని అన్నారు. బిమరి స్వామి మాట్లాడుతూ, అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో కలిసిమెలిసి జీవించడం గ్రామ అభివృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.
