ఆత్మకూరులో యువ శక్తికి నూతన ఆరంభం

సాక్షి డిజిటల్ న్యూస్ : మార్చ్ 4 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి) ఆత్మకూరు నియోజకవర్గంలో యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తూ, వైయస్సార్సీపి మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి డాక్టర్ ప్రణీత్‌కు నూతన బాధ్యతలు అప్పగించారు.ఆత్మకూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా డాక్టర్ ప్రణీత్‌ను నియమిస్తూ పార్టీ మరింత బలోపేతానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా మెట్టుకూరు సుబ్బారెడ్డి వైఎస్సార్టీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బట్రెడ్డి నాగేంద్ర రెడ్డి అనంతసాగరం మండల సోషల్ మీడియా అధ్యక్షుడు,తుమ్మల గంగాధర్ రెడ్డి వైఎస్సార్టీఏ నాయకులు, ఆత్మకూరు డివిజన్ నాయకులు కలిసి డాక్టర్ ప్రణీత్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యువశక్తిని సమీకరించి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *