సాక్షి డిజిటల్ న్యూస్ 4 మార్చి 2026, రామన్నపేట మండలం రిపోర్టర్,శ్యామల నాగరాజు వంశరాజ్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు.ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. ఆసుపత్రిలో మౌలిక వసతుల అభివృద్ధి, వైద్య సిబ్బంది సమస్యలు, అవసరమైన ఔషధాల లభ్యత వంటి అంశాలపై చర్చించారు.ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రామన్నపేట ప్రాంత ప్రజలకు అన్ని విధాలుగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. సమావేశంలో వైద్యాధికారులు, అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
