హక్కుల సాధనకై రాజీ లేని పోరాటం !!! మాజీ సర్పంచుల మోర్చా రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు వీరారెడ్డి .!!!

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 3 శంకరపట్నం కరీంనగర్ జిల్లా సీనియర్ జర్నలిస్టు బూర్ల రాజు. !!!! మాజీ సర్పంచుల హక్కుల సాధన కోసం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని మాజీ సర్పంచ్ భారతీయ మోర్చా కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు అంతం వీరారెడ్డి అన్నారు . రాష్ట్ర కమిటీ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం ఆయన సాక్షి డిజిటల్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు కేంద్ర రాష్ట్ర మంత్రులకు ఎంపీ ఎమ్మెల్యేలకు ప్రభుత్వాలు పెన్షన్ మంజూరు చేస్తుందని ఆయన చెప్పారు అదే తరహాలో మాజీ సర్పంచుల కూడా ప్రభుత్వం పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. సర్పంచుల మాజీ సర్పంచులకు పెన్షన్ విధానం ప్రవేశపెట్టి అమలు చేసే వరకు పోరాటాలు నిర్వహిస్తామన్నారు గ్రామాల అభివృద్ధికి కీలకంగా వ్యవహరించి. ప్రత్యేక వసతులు ఏర్పాటుచేసిన మాజీ సర్పంచులు ఈరోజు గ్రామాల్లో అనేక ఇబ్బందులతో సతమతమవడం జరుగుతుందన్నారు సంవత్సరాలు గడిచిన అభివృద్ధికి సంబంధించిన బిల్లులు కూడా రాకపోవడం కొందరు మాజీ సర్పంచులు రాష్ట్రస్థాయిలో ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. రాజకీయాలకతీతంగా పోరాటాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్లడమే కాకుండా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వస్తామన్నారు మారుమూల ప్రాంతాల సైతం మాజీ సర్పంచులను చైతన్యవంతం చేసే విధంగా సభలు సమావేశాలు నిర్వహిస్తామన్నారు మాజీ సర్పంచులకు పెన్షన్ విధానం పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక నివేదిక తయారుచేసి సమర్పించుటకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మాజీ సర్పంచులు చేసిన సేవలు నేటికీ ఎంతో ఆదర్శవంతంగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజా సంబంధాలతో నేటికి మాజీ ప్రజాప్రతినిధులు సేవలు చేస్తూ ప్రజల్లో ఉంటూ సమస్యల సాధన కోసం పోరాటాలు చేయడం అభినందనీయం అన్నారు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో జిల్లా కమిటీలు మండల కమిటీలు ఏర్పాటు చేసి సంఘం బలోపేతానికి విశేషంగా కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు మాజీ సర్పంచులకు కమిటీ అండగా ఉండి ఆదుకోవడం కూడా జరుగుతుందని ఆయన వెల్లడించారు ఈ విషయంలో కూడా మాజీ సర్పంచుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయుటకు ప్రణాళికలు రూపొందించడం ఉన్నట్లు ఆయన వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *