సింగీతం గ్రామంలో జాబ్ మేళా విజయవంతం

సాక్షి డిజిటల్ న్యూస్ గ్రామం సింగితం మండలం రాయికోడ్ సంగారెడ్డి జిల్లా మండలంలోని సింగీతం గ్రామ పంచాయతీ కార్యాలయంలో 02-03-2026 తేదీన సర్పంచ్ శ్రీమతి కె. శ్రావణి నిరంజన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా విజయవంతంగా నిర్వహించబడింది. ఈ జాబ్ మేళాలో ప్రముఖ సంస్థ పుస్కాల్ అగ్రిటెక్ లిమిటెడ్ ప్రతినిధులు పాల్గొని అభ్యర్థుల ఇంటర్వ్యూలు నిర్వహించారు. సుమారు 30 నుండి 40 మంది గ్రామ మరియు పరిసర ప్రాంతాల యువత ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అర్హతలకు అనుగుణంగా అవకాశాలను పొందేందుకు ఇంటర్వ్యూలు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కె. శ్రావణి నిరంజన్ మాట్లాడుతూ, గ్రామ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం గ్రామ పంచాయతీ ముఖ్య లక్ష్యమని తెలిపారు. యువత తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో మరిన్ని సంస్థలను గ్రామానికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మరియు BRS మండల నాయకులు నిరంజన్, ఉపసర్పంచ్ పీజీ మహేష్, వార్డ్ సభ్యులు ప్రభాకర్, యాదమ్మ, మొగులయ్య, ప్రశాంత్, టి. మొగులయ్య, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *