సారో జర సాయం చేయండి… ఓ వృదురాలు ఆవేదన

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 3. (చౌడపూరు ప్రతినిధి) చౌడపూర్.మండల పరిధిలోని బంగారం పల్లి గ్రామం చౌడపూర్ మండలం చెందిన నడపముని బాలకిష్టమ్మ భర్త బుచ్చయ్య తనకు తాను పనిచేయలేక ఇంటికే పరిమితమై నిస్సహాయ స్థితిలో దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం ఎదురు చూస్తూ తనకు ఎవరు మంచి చెడులు చూడని పరిస్థితిలో నిరుపేద కుటుంబానికి చెందిన వృద్ద మహిళగా ఇతరుల సహాయం కోసం చావు బతకల మధ్య ఉంది తన కొడుకు కూడా మానసిక వికలాంగునిగా ఉండి ఏమి చేయని పరిస్థితిలో ఆర్థికపరంగా వెనుకబడి సహాయం కోసం ఎదురుచూస్తున్న సంఘటన ఆ తల్లి కొడుకుల దృశ్యం వెలుగు చూసింది. ఇదే విషయంపై బంగారం పల్లి గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది గోపాల్ యాదవ్ వారికి సహాయం కోసం ప్రభుత్వం పరంగా పింఛన్ మంజూరు కోసం ప్రయత్నం చేస్తున్నారు వారి పరిస్థితిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వారికి పింఛన్ వచ్చే విధంగా ఆర్థిక పరంగా ఆదుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు కావున సంబంధించిన అధికారులు ఆ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *