సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఈనెల-3వ తేదీ గండిఆలయం మూసివేత

సాక్షి డిజిటల్ న్యూస్: చక్రాయపేట, మార్చి 3 (పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల ఆంజనేయులు) వైయస్సార్ కడప జిల్లా, చక్రాయపేట మండలం, మారెళ్ళ మడక గ్రామంలో ఉండే గండి వీరాంజనేయ స్వామి క్షేత్రంలో, సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా03-03-2026 వతేది ఫాల్గుణ శుక్ల పౌర్ణమి మంగళవారం రోజున స్వామివారి ఆలయం మూసి యబడును.ఉదయం 9:30 నిమిషాలకు దర్శనం నిలిపివేస్తామని ఈ ఆలయ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురు ప్రసాద్ తెలిపారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు కేసరిస్వామి మాట్లాడుతూ ఈ గ్రహణం కండగ్రస్త్ర చంద్రగ్రహణం అని ఈగ్రహణం భారతదేశం అంతట కనిపిస్తుందని అంతేకాకుండా ఈ గ్రహణం వేళలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు బయట తిరగకుండా ఇంటి లోపలనే ఉండవలెనుఅని సింహ రాశి వారు ఈ చంద్రగ్రహణం చూడరాదని పగలు11:00లోపు ఆహారం తినవలెను. తర్వాత సాయంత్రం 7 గంటల తర్వాత ఆహారము వండి భుజించాలని తెలిపారు. అలాగే 4. 3.2026 ప్రాతః కాలంలో ఉదయం పుణ్యా వచనం పంచామృత అభిషేకం. ఆరాధన,నివేదన, అలంకరణ, తదుపరి 7 గంటలకు ఉదయం సర్వ దర్శనం ప్రారంభం అవుతుందని తెలిపారు. గ్రహణ అనంతరం మరుసటి రోజు యథావిధిగా పూర్వఫల్గుణి నక్షత్రం వారు సింహరాశి వారు పాలు, బియ్యం, వెండి నాగపడిగ, చంద్రబింబం దక్షిణ సహితంగా దానంచేసి గ్రహణ శాంతి చేసుకోవలెను అని మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *