వెల్ఫేర్ బోర్డులోపెండింగ్ లో ఉన్న క్లైమ్ లను వెంటనే చెల్లించాలి

★ఏఐటియుసి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బల్లారపు రామాంజనేయులు

సాక్షి డిజిటల్ న్యూస్: వేంపల్లి, మార్చి 3 (పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల ఆంజనేయులు) ఏఐటియుసి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బల్లారపు రామాంజనేయులు డిమాండ్ చేశారు.గత ఐదేళ్లుగా పెండింగ్ లో ఉన్న క్లైమ్లను వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికులు మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఘం (ఏఐటియుసి అనుబంధం) జిల్లా అధ్యక్షులు బళ్లారాపు రామాంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షులు చల్లా బాలాజీ డిమాండ్ చేశారు సోమవారం వేంపల్లి గాంధీ రోడ్డు గొర్లమండల ఓల్డ్ మిషన్లోని కార్మికుల ఆఫీషులో సమావేశమై కార్మికులు పెద్దత్తున పాల్గొన్నారు వారు మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయామ్ లో మూలన పడిన భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డును పునరుద్ధీ కరించడం, కార్మికుడికి గుర్తింపు కార్డులు కొత్త సభ్యుల నమోదు,పెళ్లి కానుక ప్రసూతి సౌకర్యం, సహజ మరణం సందర్భంగా ఇచ్చే సహాయం,మట్టి ఖర్చుల వంటి పాత పథకాలను కొనసాగించాలని, నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వల్లెపు బుజ్జిబాబు,దే రంగుల శ్రీనివాసులు, కొమ్మెర గోపాల్, షేక్ బాబా ఫక్రుద్దీన్, పటాన్ కులాయప్ప తదితరులు పాల్గొన్నారు.