సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద మార్చి 3, మండల కేంద్రమైన హోళగుంద లోని రాష్ట్ర ప్రభుత్వ "వీరశైవ లింగాయత్ కార్పోరేషన్" చైర్మన్ తుల్జాపూర్ స్వప్న స్థానిక ఉరవకొండ స్వామి మఠం నందు వీరశైవుల ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సోమవారం వీరశైవ బంధువులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీరశైవులు అందరూ ఐక్యమత్యంగా ఉండాలని మరియు కేంద్రంలో వీరశైవులను ఓబిసిలో చేర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అలాగే మహిళలు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా బలోపేతం కలవాలని తెలియజేశారు.మరియు ఆదోని డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల వీరశైవులను కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.వీరశైవలింగాయతి ధర్మం గురించి వివరిస్తూ అందరూ అన్నదమ్ములుగా ఉండాలన్నారు. అంతేకాకుండా వీరశైవ సామాజిక సంక్షేమాభివృదికి నా వంతు కృషి చేస్తానన్నారు.అనంతరం వీరశైవ బంధు బాంధవులు వీరశైవ స్మశాన వాటికకు ప్రహరీ గోడ,శ్రీ జగజ్యోతి బసవేశ్వర విగ్రహం ఏర్పాటు,వీరశైవులను ఓబీసీలో చేర్చాలని వినంతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సముదాయం నాయకులు,మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
