సాక్షి డిజిటల్ న్యూస్, మార్చి 3, వరంగల్ రిపోర్టర్ జన్ను కోర్నెలు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికార కార్యక్రమాలకు హాజరైన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి, ఐపిఎస్ కి సాయుధ పోలీసుల గౌరవ వందనం ఆకర్షించింది. దీంతో డిజిపి సాయుధ పోలీసులకు అభినందనలు తెలియజేయడంతో పాటు, గార్డ్ సాయుధ పోలీసులకు క్యాష్ రివార్డ్ ప్రకటిస్తూ డ్యూటీ నోట్ బుక్ లో తన చేతి రాతతో డిజిపి ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో సాయుధ పోలీసులు డిజిపి కలసి గ్రూప్ ఫోటో దిగి సాయుధ పోలీసులు సంతోష పడ్డారు.