సాక్షి డిజిటల్ న్యూస్ 03 మార్చి, మహాదేవపూర్ (తులసి మహేష్) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు 88వ జయంతి వేడుకలను సూరారం గ్రామశాఖ అధ్యక్షులు చల్ల రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని మంథని ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచిన శ్రీపాదరావు స్పీకర్‌గా పనిచేశారన్నారు. కాటారం మండలం ధన్వాడ గ్రామానికి చెందిన శ్రీపాదరావు సర్పంచ్‌గా, సమితి ఉపాధ్యక్షుడిగా ఎల్ఎంబీ బ్యాంకు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1983 నుంచి వరుసగా మూడుసార్లు మంథని ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 ఏప్రిల్ 13న మహదేవపూర్ మండలం అన్నారం సమీపంలో అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్లు హత్య చేశారు. సర్పంచ్ స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి, శాసనసభ్యుడిగా, శాసన సభాదిపతిగా పదవి చేపట్టి పదవికే వన్నె తెచ్చారని అన్నారు. రాష్ట్రానికి ఎనలేని సేవచేశారని గుర్తు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో అజాత శత్రవుగా పేరుగాంచారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకల శంకరమ్మ, ఉప సర్పంచ్ చిన్నన్న, కాటారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముల్కల శ్రీనివాస్, తులసి మహేష్, మాజీ సర్పంచ్ చల్ల రాజిరెడ్డి,ఓడేటి రాజిరెడ్డి, చల్ల మహేష్, చల్ల రమేష్ రెడ్డి, బండం శ్రీనివాస్, ఎల్లంకి రవీందర్, బండం రమేష్ రెడ్డి, లేళ్ల సాంబం, నాగుల బాబు రెడ్డి, రత్న రాజిరెడ్డి, చల్ల మోహన్ రెడ్డి,చిన్నోళ్ల రాములు, గోడిషెల మనీష్, నాగుల లక్ష్మణ్, బండం నరేష్, ములుకల తిరుపతి, జిల్లెల్ల నాగరాజు, దామరకుంట సమ్మయ్య, జనగాం చంద్రయ్య, గోల్కొండ రాజయ్య, గుండాల నీలయ్య, చీరల తిరుపతి, మల్లారపు ఎర్రయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు…
